ఫిమేల్ స్మోకర్ల సంఖ్యలో అమెరికా తర్వాత స్థానం భారత్ దేనట!

dgfhgch

భారత్ లో ధూమపానం చేస్తున్న వారి సంఖ్య ఓ వైపు తగ్గుతుంటే, సిగరెట్లు ఊదేస్తున్న మహిళల సంఖ్య మాత్రం శరవేగంగా పెరుగుతోందట. గడచిన రెండేళ్లలోనే దేశంలో ధూమపాన ప్రియుల సంఖ్య 2 శాతం మేర తగ్గిపోయింది. అదే సమయంలో సిగరెట్ స్మోకింగ్ అలవాటు చేసుకుంటున్న మహిళల సంఖ్య మాత్రం గడచిన 32 ఏళ్లలో రెట్టింపు అయ్యిందట. దీంతో ప్రస్తుతం ఫిమేల్ స్మోకర్ల సంఖ్యలో అమెరికా తర్వాత స్థానం భారత్ దేనట.

ఇదేదో ఏ సర్వే సంస్థో చెప్పిన విషయం ఎంతమాత్రం కాదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు చెప్పిన నమ్మలేని నిజం. 2013-14 ఏడాదిలో దేశంలో 101.8 బిలియన్ల సిగరెట్లను మన ధూమపాన ప్రియులు ఊదేయగా, గడచిన ఆర్థిక సంవత్సరంలో (2014-15)లో ఈ సిగరెట్ల సంఖ్య 93.2 బిలియన్లకు తగ్గింది. ఇక మహిళా ధూమపానప్రియుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. 1980లో దేశంలో 53 లక్షల మంది మహిళా స్మోకర్లుంటే, 2012లో వీరి సంఖ్య రెట్టింపు కంటే దాటిపోయి 1.27 కోట్లకు చేరింది.

About

View all posts by

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *