ఇంద్రా నూయి

gukhki

ఇంద్రా కృష్ణమూర్తి నూయి (జననం:28 అక్టోబర్ 1955) భారతీయ మహిళా వాణిజ్యవేత్త మరియు పెప్సికో ప్రస్తుత ముఖ్య కార్య నిర్వహణాధికారి. ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకున్న ముఖ్య కార్యనిర్వహణాధికారిగా చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ. ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ కథనం ప్రకారం ఈమె ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీలురైన 100 మంది మహిళలో ఒకరు.

నేపథ్యము

ఇంద్రా నూయి 1955, అక్టోబరు 28న, తమిళనాడులోని చెన్నై నగరంలో జన్మించారు. ఆమె ఉన్నత విద్యాభ్యాసం, చెన్నైలోని హోలీ ఎంజెల్సు ఆంగ్లో ఇండియను హైయరు సెకండరీ పాఠశాలలో జరిగినది. 1974లో మద్రాసు క్రిస్టియను కళాశాల నుండి భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము మరియు గణితములు పాఠ్యాంశములుగా డిగ్రీ పట్టా పొంది అటు పిమ్మట కలకత్తాలోని ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ మేనెజిమెంట్ కాలేజినుండి 1976లో పోస్టు గ్రాడ్యుయేసను డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (ఎం.బి.ఏ) ను పొందారు. ఇంద్రా యొక్క మొదటి ఉద్యోగపర్వం భారతదేశంలోనే ప్రారంభమైనది. జాన్సను అండ్ జాన్సను లోనూ, మెట్టూరు బెర్డుసెల్ నూలుమిల్లులోనూ ఉత్పత్తుల అధికారిణిగా పనిచేశారు. ఆ తరువాత 1978లో ఆమె యేల్ విశ్వవిద్యాలయంలోని యేల్ స్కూల్ ఆఫ్ మేనెజిమెంట్లో చేరి పబ్లిక్ అండ్ ప్రెవేటు మెనేజిమెంటులో మాస్టరు పట్టాను పొందారు.యేల్‌లో వున్నసమయంలోనే ఆమె బూజ్ అల్లెన్ హామిల్టన్ లో సమ్మరు ఇంటర్నుషిప్ను చేసింది. అటుపిమ్మట ఇంద్రానూయి బొస్టన్ కన్సల్టెంట్ గ్రూపులో(BCG)చేరారు. 1980లో యేల్‌లో చదువు పూర్తయిన తరువాత మోటరోలా, ఆసియ బ్రౌన్ బొవెరీ సంస్థలలో కీలకమైన పదవీ బాధ్యతలు నిర్వహించారు.

పెప్సికో కార్యనిర్వాహకత

1994లో పెప్సీకో లో చేరింది. అనతి కాలంలోనే తన ప్రతిభ చూపి 2001 లో ప్రధాన ఆర్థిక నిర్వహణాధికారిగా (CFO ) పదోన్నతి పొందింది. ప్రపంచ వ్యాప్తంగా పెప్సీకో అనేక రంగాలలో కాలుమోపడానికి తన పదునైన వ్యూహాలను ఉపయోగించింది. దశాబ్ధకాలంలో పెప్సీకో దశ, దిశ మార్చి వేసింది. దాదాపు దశాబ్దకాలం పాటు ఆ సంస్థ ప్రపంచ వ్యాప్త వ్యూహాలను మెరుగు పరచడంలోనూ మరియు సంస్థ పునర్నిర్మాణంలోనూ పాలు పంచుకుంది. ఈమె తెచ్చిన వ్యూహాత్మక మార్పులలో 1997లో పెప్సీకో ఆధీనంలో ఉన్న ఫాస్టుఫుడ్ రెస్టారెంటులను ట్రైకాన్ ఒక కొత్త సంస్థగా విభజించడం ఒకటి. ఈ ట్రైకాన్ సంస్థే ఇప్పుడు యమ్ బ్రాండ్స్ గా మారింది. 1998లో ట్రాపికానాను పెప్సీకో లో విలీనం చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది. అలాగే క్వేకర్ ఓట్స్ సంస్థ , గేటరేడ్ యొక్క విలీనాలు కూడా ఈవిడ కృషి ఫలితంగానే జరిగాయి. 44 సంవత్సరాల పెప్సీకో సంస్థ కు ఐదవ ముఖ్య కార్య నిర్వహణాధికారిగా 2006 లో బాధ్యతలు చేపట్టింది.బిజినెస్ వీక్ పత్రిక కథనం ప్రకారం, 2000 సంవత్సరంలో ప్రధాన ఆర్థికాధికారిగా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత పెప్సీకో రాబడి 72 శాతం వృద్ధి చెందింది., మరియు లాభాలు రెండింతలయ్యి 5.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి..

2007 మరియు 2008 సంవత్సరాలలో వాల్‍స్ట్రీట్ జర్నల్ అత్యంత గమనింపదగిన మహిళల జాబితాలో చోటు దక్కించుకొంది. అలాగే టైమ్ పత్రిక అత్యంత ప్రభావశీల మహిళల జాబితాలో 2007 మరియు 2008 లలో స్థానం దక్కింది. 2008లో ఫోర్బ్స్ పత్రిక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళలలో ఈమెకు మూడో స్థానం కట్టబెట్టింది.ఫార్చూన్ పత్రిక 2009 మరియు 2010 లో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో ఒకటో స్థానంలో నిలిచింది. అక్టోబరు 7, 2010 న ఫోర్బ్స్ పత్రిక ఈవిడను ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో 6వ స్థానాన్ని కల్పించింది.

జీతభత్యాలు

పెప్సీ కో ముఖ్య కార్యనిర్వహణాధికారిగా 2011 లో ఈమె 17 మిలియన్ అమెరికన్ డాలర్లను వేతనంగా పొందింది. ఇందులో 1.6 మిలియన్ డాలర్లు మూల వేతనం కాగా, 2.5 మిలియన్ డాలర్లు నగదు బోనస్ గా మరియు 3 మిలియన్ డాలర్లు భరణం గా పొందింది.

అంతర్జాతీయ గుర్తింపు మరియు పురస్కారాలు

 1. ఫోర్బ్స్ పత్రిక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వందమంది మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది.
 2. ఫార్చూన్ పత్రిక 2006, 2007, 2008, 2009 మరియు 2010 సంవత్సరాలలో అత్యంత శక్తివంతమైన్ మహిళా వ్యాపారవేత్తల జాబితాలో స్థానం కల్పించింది.
 3. 2008 లో అమెరికాని ఉత్తమ నాయకులలో ఒకరిగా అమెరికా వార్తా మరియు ప్రపంచ నివేదిక నుండి గుర్తింపు.
 4. 2008 లో అమెరికన్ కళల మరియు విజ్ఞాన సంస్థ సభ్యత్వమునకు ఎన్నికయ్యింది
 5. 2008లో అమెరికా-భారత వాణిజ్య మండలి (USIBC) అధ్యక్షురాలిగా ఎన్నిక. ఈ పదవిలో ఈవిడ అమెరికా లోని వివిధ రంగాల నుండి ఎన్నికైన 60 మంది సభ్యుల బృందానికి నాయకత్వం వహించింది.
 6. 2009 లో ప్రపంచ సప్లయ్ చైన్ నాయకుల సంఘంద్వారా ప్రపంచ అత్యుత్తమ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా సూచించబడింది
 7. 2009 లో ప్రపంచ అత్యుత్తమ ముఖ్య కార్యనిర్వహణాధికారులలో ఒకరిగా బ్రెండెన్ ఉడ్ ఇంటర్నేషనల్ ద్వారా గుర్తింపు..
 8. 2010 లో’ఫార్చూన్ పత్రిక ద్వారా ప్రపంచ శక్తివంతమైన మహిళల జాబితాలో ఒకటో స్థానం మరియు ఫోర్బ్స్ జాబితాలో ఆరవ స్థానం.
 9. వరుసగా ఐదేళ్ళు అమెరికాలో విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తగా అగ్రస్థానం అలంకరించిన తర్వాత ఈమె స్థానాన్ని క్రాఫ్ట్ సంస్థ ముఖ్య కార్యనిర్వహనాధికారి ఇరీన్ రోస్‍ఫీల్డ్ దక్కించుకొంది.
 10. 2008 మరియు 2011 లలో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ పత్రిక సర్వే లో ఉత్తమ ముఖ్య కార్యనిర్వహణాధికారి గా ఎన్నిక.

పురస్కారములు

సంవత్సరము పురస్కారం పేరు ప్రదానం చేసిన సంస్థ
2011 గౌరవ న్యాయ డాక్టరేటు (Honorary Doctor of Laws) వేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయము.
2011 గౌరవ న్యాయ డాక్టరేటు (Honorary Doctor of Laws) వార్విక్ విశ్వవిద్యాలయము.
2011 గౌరవ న్యాయ డాక్టరేటు (Honorary Doctor of Laws) మియామీ విశ్వవిద్యాలయము.
2010 Honorary Doctorate of Humane Letters పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయము.
2009 గౌరవ డిగ్రీ డ్యూక్ విశ్వవిద్యాలయము.
2009 బెర్నార్డ్ గౌరవ డిగ్రీ బెర్నార్డ్ కళాశాల.
 • సభ్యత్వాలు మరియు సంఘాలు
 1. యేల్ కార్పొరేషన్ లో ఈవిడకు సభ్యత్వం ఉంది.
 2. ప్రపంచ ఆర్థిక సదస్సు, అంతర్జాతీయ రక్షణ సంఘం, స్వచ్చంద సంస్థ కాటలిస్ట్ ,లింకన్ సామర్థ్య కేంద్రము లలో చురుకైన సభ్యురాలు.
 3. ఐషంహోవర్ సభ్యత్వములు ధర్మకర్తల మండలిలో సభ్యురాలు అలాగే భారత-అమెరికా వాణిజ్య మండలికి అధ్యక్షురాలుగా వ్యవహరించింది.
 4. ప్రపంచ న్యాయ యోజన గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరించింది. ఈ యోజన ప్రపంచవ్యాప్తంగా అందరికీ సమాన అవకాశాల పరికల్పనకు కృషిచేస్తుంది.
 • ప్రచారాలు మరియు ప్రస్తావనలు
 • ప్రజాదరణ పొందిన టీవీ కార్యక్రమం గాసిప్ గర్ల్ రెండు భాగాలలో ఈవిడ నటించింది. బ్లైర్ వాల్డార్ఫ్ ఈమె దగ్గర శిష్యరికం చేయడానికి ప్రయత్నించిన సన్నివేశాలలో ఈవిడ కనిపించింది.
 • వ్యక్తిగత జీవితము
 • ఈమె వివాహము రాజ్ కె, నూయి తో జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరు గ్రీన్‍విచ్, కనెక్టికట్ లో నివసిస్తున్నారు. పెద్దమ్మాయి యేల్ విశ్వవిద్యాలయంలో చదువుతోంది. నూయి ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన అమ్మల్లో 3వస్థానంలో నిలిచింది

About

View all posts by

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *